logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

ఏలూరు మిస్టరీ వ్యాధికి కారణం ఇదే.. సంచలన విషయాలు వెల్లడి!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మూడు రోజులుగా వింత వ్యాధి కలకలం రేపుతోంది. ఈ వ్యాధికి గల స్పష్టమైన కారణాలను కనిపెట్టడానికి జాతీయ పరిశోధన సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో మూర్ఛ, కళ్ళు తిరగడం, కంటిలోని నల్ల గుడ్డు స్పందన లేకపోవడం, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు తీవ్రమైన కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి బారిన పడి 583 నుండి ఆసుపత్రుల్లో చేరారు. అందులో 470 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 20 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కాగా రోగుల రక్తనమూనాల్లో ప్రమాదకరమైన నికెల్‌, సీసం ఉండటం వల్లే వారు అస్వస్థతకు గురైనట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.

తాజాగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎస్‌) ఈ వ్యాధిపై జరిపిన పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వీరు ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట లో నీరు, పాలు, కూరగాయలు, బియ్యం తదితర శాంపిల్స్ ను సేకరించారు. వీటిని పరీక్షించగా అందులో హానికరమైన రసాయనాలను గుర్తించినట్టుగా పేర్కొన్నారు. రసాయనాలతో పాటుగా క్రిమి సంహారక అవశేషాలు కూడా అత్యధిక స్థాయిలో ఉన్నాయని వారు వెల్లడించారు.

కృష్ణా జిల్లాలోని ఓ కాలువలో సేకరించిన నీటి నమూనాలో 17. 84 మిల్లి గ్రాముల మెధాక్సీక్లర్‌ ఉన్నట్టుగా తేలింది. సాధారణంగా ఈ రసాయనం 0.001 మిల్లి గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. అయితే ఇది పరిమితికి మించి వేల రేట్లు అధికంగా ఉందని.. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్‌ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. అందుకే బాధితుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ రసాయనం దీర్ఘకాలంలో క్యాన్సర్ ను కలుగ చేస్తుందని వారు గుర్తించారు. అయితే అంతా అనుకున్నట్టుగా ఈ వ్యాధికి వాతావరణ మార్పులతో సంబంధం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. నీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ప్రజలు అనారోగ్యానికి గురౌతున్నట్టుగా వెల్లడించారు.

Related News