ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెతున ఎగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేసింది. పార్లిమెంట్ లో ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇస్తూ కుండబద్దలు కొట్టేశారు.
విశాఖ ప్లాంట్ నుంచి వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని, ప్రయివేటీకరిస్తామని స్పష్టం చేశారు. అయినా స్టీల్ ప్లాంట్ తో రాష్ట్రాలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ తో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం పై రాజకీయ పార్టీలతో సహా కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అందుకు ఏపీ, తెలంగాణ, మావోయిస్టులు కూడా సంఘీభావం ప్రకటించారు. కాగా ఇప్పుడు కార్మిక సంఘాలు ఉద్యమాన్ని ఉదృతం చేసే ఆలోచనలో ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల బంద్ ను కూడా చేపట్టాయి. తాజాగా కేంద్రం ప్రకటన చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పై వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.