logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పంచాయతీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు!

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఏకగ్రీవాలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్రేకులు వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరగడంపై ఆయన అనుమానం వ్యక్తం చేసారు. ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేశారు. తన తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దీనిపై పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ఫలితాలను ప్రకటించవద్దన్నారు.

ఈ రెండు జిల్లాలకు సంబందించిన నివేదిక తమ దగ్గర పెండింగ్ లో ఉన్నందున తమ తర్వాత ఆదేశాలు వచ్చిన తర్వాతనే ఫలితాలను వెల్లడించాలన్నారు. ఈ మేరకు రెండు జిల్లాలకు సంబందించిన సమగ్ర నివేదిక అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మిగిలిన 11 జిల్లాల్లో ఏకగ్రీవాలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత లో 453 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు, గుంటూరులో 67, కర్నూలులో 54 వైఎస్సాఆర్ కడప జిల్లాలో 46 ఉన్నాయి. ఇక మిగిలిన జిల్లాలో కూడా ఏకగ్రీవాలు పెరుగుతుండటంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related News