logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్… బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ!

ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఓ వైపు నిమ్మగడ్డ ఓ పార్టీ కోసం పనిచేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రమేష్ కుమార్ బీజేపీ నేతలతో రహస్యంగా సమావేశం కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ నెల 13వ తేదీన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో రమేష్ కుమార్ రహస్యంగా సమావేశమయ్యారు.

గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశానికి వీరంతా విడివిడిగా వెళ్లి ఒకే గదిలో చర్చలు జరిపారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారాయి. కాగా ఈ సమావేశానికి టీడీపీ నేతలెవరూ హాజరు కాకపోయినప్పటికీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరున్న సుజనా చౌదరీ కామినేనిలను నిమ్మగడ్డ కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోలపై వైసీపీ నేతలు స్పందిస్తూ.. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలాంటి సమావేశాలకు ఎలా హాజరవుతారని మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ ఎన్నికల అధికారిగా నిమ్మగడను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

Related News