logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తిరిగి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇవాళ ఆయ‌న అమ‌రావ‌తిలోని ఎన్నిక‌ల సంఘం కార్యాల‌యంలో ఆయ‌న‌ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ ప‌ద‌వి కోసం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ న్యాయ‌ప‌రంగా పోరాడి గెలిచారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌డంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి న‌డుమ దూరం పెరిగింది. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకాలాన్ని త‌గ్గించి, అర్హ‌త‌లు మార్చి ఆయ‌నను ప‌ద‌వి నుంచి వైదొలిగేలా ప్ర‌భుత్వం చేసింది.

త‌న‌ను ఈ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. నిమ్మ‌గ‌డ్డ‌ను తిరిగి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మించాల‌ని కోర్టు ఆదేశించింది. గ‌వ‌ర్న‌ర్ కూడా కోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. దీంతో నిమ్మ‌గ‌డ్డ‌ను తిరిగి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వం మూడు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది.

మ‌రోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ప్ర‌స్తుతం సుప్రీం కోర్టులో ఈ కేసు విచార‌ణ జ‌రుగుతోంది. నిమ్మ‌గ‌డ్డను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా పున‌ర్నియ‌మిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీం కోర్టు తీర్పును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. అంటే ప్ర‌స్తుతం నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఉంటారు. ఒక‌వేళ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు వ‌స్తే మాత్రం మ‌ళ్లీ నిమ్మ‌గ‌డ్డ ఈ ప‌ద‌విని వ‌దులుకోవాల్సి ఉంటుంది.

Related News