logo

  BREAKING NEWS

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |  

నిహారిక- చైతన్యల ప్రేమకథ చెప్పిన నాగబాబు.. అలా మోసపోయారట!

మెగా డాటర్ నిహారిక – చైతన్యల పెళ్లి ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి పెళ్ళి వార్త తెలిసిననాటి నుంచి అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిదీ ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా? అని చాలా మందికి వచ్చిన డౌటే. అయితే ఇప్పటివరకు ఆ విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు, కానీ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరిగింది.

తాజాగా నాగబాబు ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నిహారిక – చైతన్యల పెళ్లిపై షాకింగ్ విషయాలు వెల్లడించారు. నిహారిక ఛైతన్యలు 2015 నుంచే ప్రేమలో ఉన్నారట. కానీ వీరిద్దరి గురించి పెద్ద వాళ్లకు పోయిన ఏడాదే తెలిసింది. పెద్ద వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని భావించిన చైతన్య నిహారిక ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకున్నాడట. అందుకే నాగబాబు రోజు వెళ్లే అపోలో జిమ్ లోనే తాను కూడా జాయిన్ అయ్యాడు. అప్పుడప్పుడు నాగబాబును పలకరిస్తూ పరిచయం పెంచుకునేవాడు.

అలా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నాగబాబుకు చివరకు షాకిచ్చారట. అయితే నిహారిక ప్రేమ విషయం తెలిసి చైతన్య గురించి ఆరా తీయగా అతను గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకేనని తెలుసుకున్నారు. అప్పటికే వీరితో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉండటంతో పెళ్లికి ఒకే చెప్పేశామని నాగబాబు వెల్లడించారు.

Related News