logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

 మెగా ఫ్యామిలీకి అల్లుడిగా రాబోతున్న ఈ అబ్బాయి ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది. నితిన్, నిఖిల్ సిద్దార్థ్, రానా దగ్గుబాటి ఇలా ఒక్కొక్కరుగా తమ జీవిత భాగస్వాములను వెతుక్కుని సెటిల్ అయిపోతున్నారు. తాజాగా మెగా ఫ్యాలిలీ నుంచి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. మెగా డాటర్, నాగ బాబు కుమార్తె నిహారిక పెళ్లి పై ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఒక మనసు సినిమాలో నటించిన నాగ శౌర్యను నిహారిక పెళ్లిచేసుకుంటుందని, మరోసారి ప్రభాస్ తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్లే కావడంతో అంతా లైట్ తీసుకున్నారు. తాజాగా తన పెళ్లి విషయమై నిహారిక స్వయంగా ప్రస్తావించింది.

రెండు రోజులుగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో తాను పెళ్లి చేసుకోబోతున్నాననే హింట్ ఇస్తుంది. తాజాగా తనకు కాబోయే అబ్బాయి ఫోటోను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. అయితే అతనికి సంబందించిన ఎలాంటి వివరాలు నిహారిక తెలియజేయలేదు. దీంతో మెగా ఫ్యామిలీకి అల్లుడిగా రాబోతున్న ఈ కుర్రాడు ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం.. నిహారిక పెళ్లి చేసుకోబోయే ఈ అబ్బాయి పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. గుంటూరుకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇతను ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో ఎగ్జిక్యుటివ్ గా పనిచేస్తున్నాడు. మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభాకర్ రావు కు మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది.

మెగా కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యానికి జొన్నల గడ్డ ప్రభాకర్ రావు ఫ్యామిలీ తప్పకుండా హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో నిహారికకు ఈ మ్యాచ్ పర్ఫెక్ట్ అని మెగా బ్రదర్స్ నిర్ణయించారట. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఆగస్టులో నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం.

Related News