logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మెగా ఫ్యామిలిలో పెళ్లి సందడి.. పెళ్లిపీటలెక్కనున్న నిహారిక..?

కొణిదెల వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆమె చేసిన సినిమాలు వినూత్నంగానే ఉన్నా ఆమె ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం సంపాదించలేకపోయింది. దీంతో సిల్వర్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పి ఇప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. అయితే నిహారిక పెళ్లిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె తండ్రి నాగబాబు కూడా వచ్చే ఏడాది నిహారికకు పెళ్ళిచేస్తామని స్పష్టం చేసారు.

ఇప్పుడు ఆమె పెళ్లి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇవి ఎవరో సృష్టించిన రూమర్లు కావు నిహారిక స్వయంగా తన సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోబోతున్నాననే హింట్ ఇచ్చింది. స్టార్ బక్స్ కాఫీ కప్పుపై ‘మిస్ నిహారిక’ అని రాసి ఉన్న అక్షరాలని కొట్టి వేసి ‘మిసెస్’ అంటూ క్వశ్చన్ మార్కు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఓ వ్యక్తిని కౌగలించుకుని నవ్వుతూ తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కనిపెట్టమన్నట్టుగా కాప్షన్ కూడా ఇచ్చింది.

ఆ వ్యక్తి మొహం కనిపించకపోవడం తో ఇప్పుడు నిహారిక అంత చనువుగా ఉన్న అతను ఎవరా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అతనెవరు? పెళ్లి ఎప్పుడో చెప్పాలంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే నిహారికకు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా జరిగిందని ఆగస్టులో వీరి పెళ్లి కబురు వినిపిస్తుంది సమాచారం.

Related News