టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘ఇస్మార్ట్ శంకర్’ తో సొంతం చేసుకుంది నిధి అగర్వాల్. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నిధి తమిళ ప్రేక్షకులను కూడా పలకరించబోతుంది. నిధి అగర్వాల్ తొలిసారిగా నటించిన తమిళ్ సినిమా ‘ఈశ్వరన్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో హీరో శింబుతో నిధి ఆడిపాడనుంది.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఒకటి చెన్నైలో జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో సినిమా దర్శకుడు సుశీంద్రన్ నిధితో ప్రవర్తించిన తీరు అతన్ని విమర్శలపాలు చేసింది. నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడుతుండగా పక్కనే ఉన్న దర్శకుడు సుశీంద్రన్ ఆమె చెవిలో ‘శింబు మామ ఐ లవ్ యూ’ అను అంటూ పదే పదే చెప్పడం ఆమెను ఒకింత ఇబ్బందికి గురిచేసింది.
ఆ విషయం నిధి మోహంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఆమె డైరెక్టర్ మాటలు పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని ముగించింది. అయితే అతను మాత్రం అప్పటికీ ఆమెను వదలకుండా ఐ లవ్ యు చెప్పాలనడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు సుశీంద్రన్ పై ట్రోలింగ్ జరుగుతుంది.
ఒక హీరోయిన్ ను బలవంతంగా హీరోకు ఐ లవ్యూ చెప్పాలంటూ ఇబ్బంది పెట్టడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాగా ఈ ఘటనపై స్పందించిన దర్శకుడు సుశీంద్రన్ సినిమాలో మామా ఐ లవ్ యూ అంటూ హీరోయిన్ హీరో వెంటపడే సీన్ ఉంటుందని ఆ డైలాగ్ హైలెట్ చేయడానికే అలా అడిగానని వివరణ ఇచ్చుకున్నాడు.
sorry but even i feel uncomfortable when i see it…i know its fun but…🤢 #Eeswaran #EeswaranAudioLaunch pic.twitter.com/2kpCROOrxj
— SUJAN (@sujanvj) January 2, 2021