logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

దీపావళి బాణాసంచా విక్రయాలపై నిషేధం… నేటి నుంచే అమలు!

వాయు కాలుష్యం కోవిడ్ -19 రోగులు, వృద్దులు చిన్న పిలల్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న కారణంగా బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఈ మేరకు తీర్పునిస్తూ.. నవంబర్ 30 తేదీ వరకు బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించింది. ఈ తీర్పు నేటి అర్థరాత్రి నుంచే అమలులోకి రానుంది.

23 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అదే విధంగా న్యూ ఇయర్, క్రిస్టమస్ వేడుకలలో కూడా కేవలం 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే. గాలి నాణ్యత మోడరేట్ గా ఉన్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ ను మాత్రమే కాల్చాలని తెలిపింది.

Related News