logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఇంట్లోనే కరోనా ఇలా చెక్ చేసుకోండి.. నిమిషాల్లో తెలిసిపోతుంది

లాక్ డౌన్ సడలింపులతో ప్రజలంతా తిరిగి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే ఎక్కడ చూసినా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో ఉద్యోగాల రీత్యా బయటకు వెళ్లి వచ్చే వారు తమకు ఎక్కడ ఈ వైరస్ సోకిందో అని ఆందోళనకు గురవుతున్నారు. ఆ భయంతోనే కాలాన్ని గడిపేస్తున్నారు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా వైరస్ సోకిందేమోనని అనుమానిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేసుకునే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచే తేలికగా కరోనా పరీక్షలు నిర్దారించవచ్చు అంటున్నారు న్యూజిలాండ్ కు చెందిన భారత సంతతి వైద్యురాలు. తేలికపాటి పరీక్షలతో వైరస్ మన శరీరంలో ఉందొ లేదో కనిపెట్టవచ్చని చెబుతూ ఇటీవల ఈమె విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జనరల్ ప్రాక్టీషనర్ గా పని చేస్తున్న భారత సంతతి వైద్యురాలు సంధ్యా రామనాథన్.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. శరీరంలో కరోనా ప్రవేశించిన అనంతరం ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గుతుంది. అయితే మార్కెట్లో సులువుగా లభించే ఆక్సీ మీటర్ అనే మిషన్ ను ఉపయోగించి దీనిని పరీక్షించుకోవచ్చు. మీటర్ చివరన చూపుడు వేలిని ఉంచితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా రేటు ఎంత ఉందొ డిగ్రీల రూపంలో చూపుతుంది. ఈ మీటర్ రీడింగ్ 95 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఒకవేళ 93 కన్నా తక్కువ చూపితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ఇక రెండో పద్దతిలో కరోనా వైరస్ ఉన్న వారు శ్వాసను ఎక్కువ సేపు నిలిపి ఉంచలేరు. కాబట్టి ఒక రెండు పెద్ద బెలూన్లు తీసుకుని వాటిలో గాలిని ఊపడం ద్వారా మనం ఎంత సేపు శ్వాసను ఆపగలుగుతున్నామో గుర్తించవచ్చు అని తెలిపారు. కరోనా వైరస్ సోకిన వారికీ కూడా ఆమె కొన్ని సలహాలు, సూచనలు చేసారు. వైరస్ ఊపిరితిత్తుల్లోని గోడల్లో చివరి భాగాన అతుక్కుని ఉంటుందని దానిని బయటకు పంపేందుకు శ్వాసకు సంబందించిన వ్యాయామాలు చేయాలన్నారు. విటమిన్ సి, డి, జింక్ ను శరీరానికి అందేలా చూసుకోవాలని అందువల్ల రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చన్నారు.

https://youtu.be/2ZoBb-ngk5k

Related News