logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

3 అంగుళాల ఎత్తు పెరగడానికి రూ. 55 లక్షలతో సర్జరీ.. చివరకు ఏమైందంటే?

సాధారణంగా ఎవరైనా బరువు పెరగడం, తగ్గడం సాధ్యపడుతుంది. కానీ ఒక వయసు తర్వాత ఎత్తు పెరగడం అనేది మాత్రం దాదాపు అసాధ్యమే. కానీ ఇలా ఎత్తు పెంచేందుకు వివిధ కాస్మెటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. 2016 లో నగరానికి చెందిన నిఖిల్ రెడీ అనే వ్యక్తి ఎత్తు పెరగడానికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ సమయంలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డాడు.

అందుకోసం రూ. 5 లక్షల దాకా చెల్లించాడు. అయితే ఇప్పుడు ఇలాంటి వార్తే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికాలోని డల్లాస్ కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్‌ అనే వ్యక్తి 28 ఏళ్ల వయసులో ఎత్తు పెరగాలని అనుకున్నాడు. అందుకోసం ఏకంగా రూ. 55 లక్షలు ఖర్చుచేసాడు. ఓ కాస్మెటిక్ సర్జన్ సంప్రదించి తాను ఎత్తు పెరగాలనుకుతున్న విషయం చెప్పగా ‘లింబ్‌ లెంథ‌నింగ్’ అనే సర్జరీ ద్వారా మూడు ఇంచులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపాడు.

దీంతో ఆ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు. తాను అనుకున్నట్టుగానే ఆగస్టు నెలలో సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ పూర్తయ్యేసరికి రూ. 55 లక్షలు ఖర్చయింది. అయితే చివరకు ఆ యువకుడు తాను అనుకున్నది సాధించాడు. సర్జరీకి ముందు 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న ఆ యువకుడు సర్జరీ తర్వాత 6 అడుగుల 1 అంగుళానికి అంటే 3 అంగుళాలు పెరిగాడు. కాగా ప్రస్తుత తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్టుగా తెలిపాడు. కానీ ఇలాంటి సర్జరీలు కొన్ని సార్లు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కు గురి చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు.

Related News