logo

  BREAKING NEWS

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |  

ఉరివేసుకుని భార్య.. రైలు పట్టాలపై భర్త.. కొత్త జంట విషాదం

ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. చిన్న విషయాలకే కలత చెంది తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. ఏపీలోని ధర్మవరం పట్టణానికి చెందిన శివ శంకర్(25) డిగ్రీ వరకు చదువుకున్నాడు. గాంధీ నగర్ ప్రాంతానికి చెందిన గౌతమి(23) ఎంబీఏ పూర్తి చేసింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో మూడు నెలల క్రితం ఓ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

కాగా శివశంకర్ గౌతమిని ఇంటికి తెచ్చి ఉంచాడు. శివశంకర్ తండ్రి మున్సిపాలిటీ విభాగంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా శివశంకర్ తండ్రికి బదులు అతనే మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న గౌతమి తల్లిదండ్రులు కూతురు అల్లుడిని ఇంటికి పిలిపించి సర్దిచెప్పారు.

ఆ రోజు రాత్రి మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లోని ఒక గదిలో ఇద్దరు నిద్రిస్తున్నారు. శివ శంకర్ ఎదో అలికిడి కావడంతో లేచి చూసేసరికి తన కళ్ల ముందే గౌతమి ఉరి వేసుకుని కనిపించింది. ఈ విషయం అత్తమామలకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన శివ శంకర్ నేరుగా లక్ష్మి చెన్నకేశవపురం రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గౌతమి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News