logo

  BREAKING NEWS

‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |  

ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి వెళుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతి!

ప్రేమ పెళ్లి చేసుకున్న నవ జంట గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చేటుచేసుకుంది. జిల్లాలోని సదాశివ నగర్ మండలం మోడెగాం గ్రామానికి చెందిన బుట్ట సతీష్(24), హైదరాబాద్ గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన మహిమ(22) కొంత కాలంగా ప్రేమించుకున్నారు.

తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని భావించి హైద్రాబాద్లోని ఓ గుడిలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి చేసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు పెళ్లి విషయం చెప్పడానికి సతీష్ స్వగ్రామమైన మోడెగాం కు బయలుదేరారు. కాగా మార్గ మధ్యంలో పెద్దలు ఒప్పించే విషయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. జాతీయ రహదారి 44 పై సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లే దారిలో రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న గురు తెలియని వాహనం నవ దంపతులను ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వీరిద్దరూ మరణించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

Related News