logo

సెల్ ఫోన్లో నగ్నఫోటోలు.. నవ వధువు ఆత్మహత్య..!

పెళ్ళయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉన్న విషయం బయటపడటంతో తనకు జరిగిన మోసాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దీంతో శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కర్ణాటక రాష్ట్రం మైసూరు లోని ఆనంద్ నగర్ కు చెందిన భావన (24)కు నెల క్రితం అదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అజయ్ కుమార్ తో వివాహం జరిపించారు పెద్దలు. ఇటీవల భర్త మొబైల్ ఫోన్లో కొన్ని ఫోటోలు ఆమె కంటపడ్డాయి. తన భర్త వేరే మహిళతో నగ్నంగా ఉన్న ఫోటోలు చూసి ఆమె భర్తను నిలదీసింది. పెళ్లికి ముందు నుంచే అజయ్ కు వేరే మహిళతో సంబంధం ఉందని తెలియడంతో ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వారు సర్ది చెప్పినా భర్త తన తీరును మార్చికోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భావన శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈఘటనపై కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News