logo

  BREAKING NEWS

కేంద్ర బడ్జెట్: వాహనాలపై కొత్త పాలసీ ప్రకటించిన నిర్మలమ్మ

దేశ బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశ పెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా బడ్జెట్ లో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్టుగా తెలిపారు. వాహనాల వలన పర్యావరణానికి ఏర్పడుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని గడువు ముగిసిన వాహనాల కోసం ఈ ప్రత్యేక పాలసీని ప్రకటించారు.

వాహనాల నుంచి ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు గడువు ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా పక్కన పెట్టేలా పాలసీ రూపొందించారు. వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏళ్ళు అని, కమర్షియల్ వాహనాల జీవితకాలం 15 ఏళ్ళు అని ప్రకటించారు. 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కులా మార్చే ఈ పథకాన్ని రూపొందించారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలకు 15 ఏళ్లుగా గడువు నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి విరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్యం నివారణకు రూ. 2217 కోట్లు కేటాయించారు కేంద్రమంత్రి.

Related News