logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

విజృంభిస్తున్న కొత్తరకం కరోనా.. మరోసారి లాక్ డౌన్!

బ్రిటన్ దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసందే. ఫైజర్ వాక్సిన్ ను అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన బ్రిటన్ అక్కడి ప్రజలకు భారీ ఎత్తన పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి బ్రిటన్ ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ కొత్తరకం కరోనాతో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతుండటమే ఇందుకు కారణం.

గతంలో కన్నా కరోనా వేగవంతంగా వ్యాప్తి చెందడంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త రక కరోనా వైరస్ ను గుర్తించారు. ఇప్పటికే కరోనా పలు రకాలుగా రూపాంతరం చెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్రిటన్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఈ కొత్త రకం కరోనా బారిన పడ్డారు.

దీంతో ఆ దేశంలో మరోసారి ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. ఇప్పటివరకు తెరిచి ఉంచిన సినిమా హాళ్లు, పబ్లను మూసివేయాలని ఆ దేశం ఆదేశించింది. అలాగే ప్రజలు అత్యధికంగా గుమిగూడే ప్రదేశాలపై సైతం ఆంక్షలు విధించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తుంది ప్రభుత్వం. దీంతో బుధవారం నుంచి అక్కడ ఈ కొత్త ఆంక్షలు అమలులోకి రాబోతున్నాయి. త్వరలోనే మరోసారి బ్రిటన్ ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకోనుంది.

Related News