logo

  BREAKING NEWS

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అరెస్టులో కొత్త ట్విస్ట్.. ఎంకౌంటర్ భయంతోనే..!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను పోలీసులు అరెస్టు చేసారు. యూపీలోని కాన్పూర్ బిక్రూ గ్రామంలో తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో డీఎస్పీ సహా ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. దూబే కేసును సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల సమాచారాన్ని దూబేకు చేరవేసింది పోలీసు డిపార్టుమెంటు వారేనని తేల్చారు.

చౌబేపూర్ మాజీ స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారి, బీట్ ఇన్‌ఛార్జ్ కేకే శర్మ‌ను అరెస్ట్ చేశారు. కాల్పులు జరుగుతున్న సమయంలో వీరిద్దరూ ఘటన స్థలం నుంచి పారిపోయారు. దూబే కోసం పోలీసులు 40 బృందాలుగా ఏర్పడిన పోలీసులు యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీలో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా మధ్యప్రదేశ్ మహంకాళి ఆలయంలో వికాస్ దూబేను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. పోలీసులు దూబేను పెట్టుకున్నారా? లేక అతను ప్లాన్ ప్రకారమే లొంగిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు దూబే అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. దీంతో అతనికి వెన్నులో వణుకు పుట్టింది. పోలీసులు రౌండప్ చేసిన సమయంలో నిందితుడు అక్కడున్న విలేకరులకు వినిపించే విధంగా తన పేరును గట్టిగా అరుస్తూ చెప్పాడని సమాచారం. అందుకే ఎంకౌంటర్ భయంతోనే దూబే లొంగిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News