logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

నటి చిత్ర ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్!

తమిళ టీవీ నటి విజె చిత్ర మృతి కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఇటీవల ఆమె తాను ఉంటున్న హోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించారు. ఈ ఘటన పరిశ్రమలో సంచలనంగా మారింది. అయితే పోస్టు మార్టం నివేదికలో చిత్రది ఆత్మహత్యే అని తేలింది. అయితే ఆమె ఆత్మహత్య వెనుక ఏదైనా బలమైన కారణమే ఉంటుందని పోలీసులు అనుమానించారు.

ఈ నేపథ్యంలో ఆమె భర్త హేమ నాథ్, సహా నటీనటులను విచారించడం మొదలు పెట్టారు. తాజాగా ఈ కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. చిత్ర కేసులో ఆమె భర్త హేమనాథ్ ను పోలీసులు దోషిగా తేల్చారు. ఓ టీవీ షోలో ఆమె నటించిన సీన్ల పట్ల భర్త హేమనాథ్ అభ్యంతరం వ్యక్తం చేసాడు.

ఈ విషయంపై ఆమెతో గొడవకు దిగాడు. మాటల మధ్యలో చిత్రను నెట్టివేయడంతో ఆమె అవమానంగా భావించింది. భర్త తీరుతో తీవ్ర మనోవేదనకు గురైన చిత్ర అదే రోజు రాత్రి హోటల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాగా చిత్రతో హేమనాథ్ కు ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం అయ్యింది.

మరికొన్ని రోజుల్లో పెళ్లి కూడా కానున్ననేపథ్యంలో అంతకు ముందే వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక హోటల్ గదిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిత్రకు అత్యంత గుర్తింపు తెచ్చిన ఆ టీవీ షోనే ఇప్పుడు ఆమె మృతికి కారణమవ్వడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News