logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం..?

ముంబైలోని స్మశాన వాటికలో కొద్ది సేపటి క్రితమే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు ముగిసాయి. ముంబైలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న కారణంగా కేవలం 20 మంది అంత్యంత సన్నిహితుల మధ్య భారీ వర్షంలో అతని అంత్యక్రియలు పూర్తి చేసారు. కాగా సుశాంత్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమని, బాలివుడ్ ప్రముఖులు అతన్ని ఒంటరి వాడిని చేసి అవకాశాలు రాకుండా చేసారని ఇలా రకరకాల కారణాలు తెరపైకి వస్తున్నసంగతి తెలిసిందే.

తాజాగా పోలీసులు సుశాంత్ సింగ్ స్నేహితురాలు రియా చక్రబర్తిని విచారిస్తున్నారు. కాగా తెలుగులో ‘తూనీగా తూనీగ’ సినిమాలో నటించింది రియా. సుశాంత్ రియాలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సుశాంత్ రియాను ఈ సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అతని సన్నిహితులు తెలిపారు. అయితే ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూస్తుంది.

రియా సుశాంత్ లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇటీవల వీరిద్దరి మధ్య ఏదో వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. ఆత్మహత్యకు ముందు కూడా సుశాంత్ రియా కు అతని స్నేహితుడు మహేష్ కు ఫోన్ చేసి మాట్లాడే పత్రయత్నం చేసాడు. కానీ వారిద్దరూ కూడా సుశాంత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇది జరిగిన కొద్ది గంటలకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పోలీసులు రియాను, సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండెను, స్నేహితుడు మహేష్ ను విచారిస్తున్నారు. ఈ విచారణలో ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Related News