logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

లాయర్ దంపతుల హత్య కేసులో ఊహించని ట్విస్ట్!

పెద్దపల్లి జిల్లా లాయర్ దంపతుల హాత్య కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఆలయ వివాదమే కారణమని పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఈ కేసును కీలక మలుపు తిప్పినట్టుగా తెలుస్తుంది. గ్రామంలో వామన్ రావుకు కుంట శ్రీనుకు మధ్య తగాదాలు ఉన్న విషయం వాస్తవమే అయినా ఈ హత్య వెనుక మరికొందరి హస్తం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా వెల్లడైన విషయాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి.

ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్ న పోలీసులు అరెస్టు చేశారు. అతని ద్వారా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పాత్ర వెలుగులోకి వచ్చింది. పుట్ట మధు మేనల్లుడే బిట్టు శ్రీను. ఇతను వామన్ రావు దంపతుల హత్యకు ఉపయోగించిన కారును, ఆయుధాలను కుంట శ్రీనుకు అందించాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఇది రికార్డు కావడంతో బిట్టు శ్రీను తన పాత్రను అంగీకరించక తప్పలేదని సమాచారం.

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి లింగమ్మ పేరిట ఓ చారిటబుల్ ట్రస్టును ఏర్పరు చేసాడు. దానికి అతని మేనల్లుడైన బిట్టు శ్రీనును ఛైర్మెన్ గా ఉంచాడు. అయితే ఈ ట్రస్టు లో ఆదాయ వ్యయాలలో అవకతవకలు జరుగుతున్నాయని, తప్పుడు లెక్కలు చూపుతూ నిధులను దారి మళ్లిస్తున్నారంటూ మాజీ వార్డు సభ్యుడు ఇనుముల సతీష్ 2018 లో ఆదాయపు పెను శాఖ, ఈడీకి ఫిర్యాదు చేసాడు. అందుకు సంబంధించి వామన్ రావు దంపతులను ఆశ్రయించాడు.

ఈ విషయంపై వామన్ రావు దంపతులిద్దరూ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వివాదాల తర్వాత జరిగిన శాసన సభ ఎన్నికల్లో పుట్టా మధు ఓడిపోయాడు. ఆ తర్వాత ట్రస్టు కార్యకలాపాలను నిలిపివేస్తున్నటుగా ప్రకటించాడు. దీనంతటికీ వామన్ రావు దంపతులు కారణమని భావించిన బిట్టు శ్రీను వారిపై కక్ష పెంచుకున్నట్టుగా చెప్తున్నారు. అందుకే వారి హత్యకు సహకరించాడని సమాచారం. అయితే ఈ హత్యలో పుట్టా మధు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News