logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కీసర తహశీల్ధార్ నాగరాజు కేసు కీలక మలుపు… మరో ఆత్మహత్య!

కీసర తహశీల్ధార్ నాగరాజు ఆత్మహత్య అనంతరం తాజాగా ఇదే కేసులో మరో దోషిగా ఉన్న ధర్మారెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మొన్నటి వరకు జైలులో ఉన్న ధర్మా రెడ్డి ఇటీవల బెయిలుపై విడుదలయ్యాడు. హైదరాబాద్ లోని కుషాయిగూడ శివాలయం దగ్గర ఉన్న ఓ చెట్టుకు ధర్మారెడ్డి ఉరి వేసుకుని కనిపించాడు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ధర్మారెడ్డి ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీసర మండలం రాంపల్లి గ్రామంలోని రూ. 40 కోట్ల విలువచేసే 24 ఎకరాల 16 గుంటల స్థలాన్ని తహశీల్ధార్ నాగరాజు సహాయంతో ధర్మారెడ్డి తమ బంధువుల పేరుపై పట్టా చేయించుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఈ కేసులో నాగరాజుతో పాటుగా ధర్మారెడ్డిపై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసులో మరిన్ని భారీ తలకాయలు ఉన్నాయని నిందితులను విచారిస్తే వారి పేర్లు బయటకు వస్తాయంటూ బాధితులు ఆందోళన చేయడంతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులు నాగరాజు, ధర్మారెడ్డిలు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Related News