వరంగల్ జిల్లా గొర్రె గొర్రెకుంట లో సంచలనం రేపిన సామూహిక హత్యల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మానవత్వం మరిచి పది మందిని సామూహికంగా హతమార్చిన నిందితుడు సంజయ్. గతంలో నిందితుడిని విచారించిన సమయంలో రఫీకాను హత్య చేసిన విషయం వెలుగు లోకి వచ్చింది. అయితే నిందితుడి నేర చరిత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రఫీకా కూతురు, 14 ఏళ్ళ మైనర్ బాలికపై నిందితుడు సంజయ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు తేలింది. దీంతో బాలికను ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించగా అప్పటికే బాలిక గర్భవతి అని వైద్యులు నిర్దారించారు. దీంతో సంజయ్ పై మరో రెండు కేసులు నమోదు చేసారు పోలీసులు.
బాలిక మైనర్ కావడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చార్జ్ షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. గత నెలలో బీహార్ పశ్చిమ , బెంగాల్ కు చెందిన 9 మందిని రఫీకా హత్యను కప్పిపుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి దారుణంగా హత్య చేసాడు. అనంతరం వారందరిని మూట కట్టి ఇంటి పక్కనున్న గొర్రెకుంట బావిలో పడేసాడు.