logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

గ్యాంగ్ స్టర్ న‌యీం కేసులో కొత్త కోణాలు.. ఆ అధికారులకు టెన్షన్!

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ న‌యీం కేసులో కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తీసుకున్న కీలక నిర్ణయంతో న‌యీం తో సత్సంబంధాలు కలిగి ఉన్న అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. న‌యీం బాధితులకు న్యాయం జరిపించాలనే ఉద్దేశ్యంతో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్.. లోక్ పాల్ చట్టం కింద ఈ కేసును విచారించాలని కోరింది.

సమాచార హక్కు చట్టం ద్వారా గతంలో న‌యీం తో సన్నిహితంగా ఉండి అతని అవినీతిలో పాలు పంచుకున్నారని అనుమానం ఉన్న పోలీసులు, రెవెన్యూ అధికారుల ఫోటోలు, వివరాలను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది. ఇప్పుడు ఆ వివరాలతో సదరు అధికారులపై లోక్ పాల్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.

వారు సేకరించిన వీడియోలు, ఫోటోలను లోక్ పాల్ కు అందించి అధికారులపై విచారణ జరిపించవలసిందిగా కోరనుంది. తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, గోవాలో పోలీసు అధికారులు, రాజకీయా నాయకులతో న‌యీంకు ఉన్న లింకులపై కూడా విచారణ జరపాలని లేఖ ద్వారా పేర్కొంది. నయీంతో 25 మంది పోలీస్‌ అధికారుల సంబంధం ఉన్నట్లుగా సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు.

తాజా విచారణతో మరికొంత మంది అధికారుల భాగోతం బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2016 లో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లోని మిలీనియం టౌన్ షిప్ లో తలదాచుకున్న నయీం పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే.

Related News