logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

దివ్య కేసులో కొత్త కోణం.. ఆమె జీవితంలో అన్నీ విషాదాలే!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ దివ్య(22) హత్య కేసులో మరో కీలక విషయాన్ని పోలీసులు సేకరించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలో దివ్య పిన్ని తో సహా దివ్య ను పెళ్లి చేసుకున్న యువకుడిని కూడా అరెస్టు చేయనున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్యం నుంచి దివ్య జీవితంలో అన్ని విషాదాలే చోటుచేసుకున్నాయి. చిన్నప్పుడే దివ్య తన తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత ఓ రౌడీ షీటర్ దివ్య తల్లి, అమ్మమ్మ, తమ్ముడిని కిడ్నప్ చేసి హత్య చేసాడు. అనాథగా మారిన దివ్య తన పిన్ని ఇంటికి చేరింది. కాగా 2018 లో దివ్యకు వీరబాబు అనే వ్యక్తితో వివాహం అయినట్టుగా పోలీసులు గుర్తించారు.

కాగా అతను పెళ్లయిన కొంత కాలానికే దివ్యను వ్యభిచారం చేయాల్సిందిగా ఒత్తిడి చేసేవాడని అందుకు దివ్య పిన్ని కూడా సహకరించినట్టుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరి ఒత్తిడి భరించలేకపోయిఅన్ దివ్య అక్కడి నుండి విశాఖపట్నంలోని వసంత గ్యాంగ్ వద్దకు చేరింది. ఆర్థిక అవసరాల కోసం వసంత ఆమె సోదరి మరికొంతమంది కలిసి దివ్యను వ్యభిచార రొంపిలోకి దింపారు.

దివ్యను అడ్డం పెట్టుకుని వ్యాపారం ప్రారంభించారు. కొంత కాలంగా డబ్బుల విషయం లో దివ్య కు వసంత గ్యాంగ్ కు మధ్య అభిప్రాయం బేధాలు ఏర్పడ్డాయి. దీంతో దివ్య పై పగ పెంచుకున్న వసంత ఆమెను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. ఆమెను అందవికారంగా మార్చి అత్యంత దారుణంగా హిసించి హత్య చేశారు. దివ్య శరీరం పై మర్మాయవాలపై మొత్తం 30 తీవ్ర గాయాలను కనుగొన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులను పూర్తిగా విచారించడానికి కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.

Related News