logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!

పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాజాగా ఎస్ఈసి నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు దాటిన వారికి ఓటుహక్కు ఉందంటూ పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని ఈ పిటిషన్ ను దాఖలు చేసింది.

పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులు సహకరించకపోయివడంతో 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇలా జరగడం వలన 3లక్షల 60 వేల మంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్ లో పిటిషనర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రేపు పంచాయత్ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.

నిన్న ఎస్ఈసీ తొలి విడత ఎన్నకల నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రేపటి నుంచి తోలి విడత నామినేషన్లు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు నామినేషన్లకు సంబందించిన ఎలాంటి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేయలేదు. హై కోర్టు తీర్పుతో ఇప్పటికే రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికల సంఘం చెప్తుంది.

Related News