logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 19 కి చేరింది. ఈ కేసులో తాజాగా 15 మంది శనివారం పోలీసులు అరెస్టు చేసారు. ఈకేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి అఖిల ప్రియ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉండగా ఈ కేసు విషయమై పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

తాజాగా ఈ కేసులో అరెస్టైన 15 మంది కూడా ప్రవీణ్ రావు ఇంటికి ఐటీ అధికారులుగా వెళ్లిన వారేనని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ అనంతరం కొందరు విజయవాడకు తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. వీరందరిని గుంటూరు శ్రీనుకు సన్నిహితుడైన సిద్దార్థ్ అనే వ్యక్తి పంపినట్టుగా తెలిసింది. సిద్దార్థ్ విజయవాడలో ఓ మ్యాన్ పవర్ కన్సెల్టెన్సీ ని నడుపుతున్నాడు. బోయిన్ పల్లి కిడ్నాప్ పథకంలో భాగంగా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ కలిసి తమకు కొందరు కిరాయి మనుషులు కావాలని కోరగా గుంటూరు శ్రీను సిద్దార్థ్ కు ఈ విషయాన్నీ చేరవేసాడు.

దీంతో విజయవాడకు చెందిన వివిధ కాలనీల నుంచి కొంత మంది కిరాయి గుండాలను, తమ అనుచరులను కూకట్ పల్లి లోని పార్థ గ్రాండ్ హోటల్ కు పంపించాడు. అనంతరం భార్గవ్ రామ్ వీరందరికి ఐటీ అధికారులు గా యూసుఫ్ గూడా లోని ఎంజీఎం స్కూల్ లో శిక్షణ ఇచ్చాడు. అయితే సిద్దార్థ అనే వ్యక్తి ఇలా కిరాయి మనుషులను పంపడం ఇది కొత్త కాదట. ఆమె గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఆమె ఎక్కువగా బెంగుళూరు, హైదరాబాద్ లో ఉండేవారు. ఎప్పుడైనా అమరావతికి పర్యటనకు రావలసి వస్తే ఆమె చుట్టూ మందీ మార్బలం ఉండాలని కోరుకునేవారట. అప్పటి నుంచే సిద్దార్థ అనే వ్యక్తి అఖిల ప్రియ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసేవాడని తేలింది. ఒక్కొక్కరికి రోజుకి రూ. 1000 చెల్లించేవారట. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్ రామ్ అతని కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News