logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

మీరు తాగక్కర్లేదు.. డ్రైవర్ తాగినా మీకే జైలు: వాహనదారులకు పోలీసుల ఝలక్

నిబంధనలను అతిక్రమించే వాహనదారులపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడానికి పోలీసులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు కొత్త నిబంధనను తీసుకొచ్చారు. సాధారణంగా ఎవరైనా వాహనదారుడు తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటారు.

కానీ తాజా నిబంధన ప్రకారం మీరు తాగక్కర్లేదు.. తాగి వాహనం నడిపేవారి పక్కన కూర్చున్నా దానిని నేరంగానే పరిగణిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా వాహనదారులకు హెచ్చరికలు చేస్తున్నారు. మీ డ్రైవర్, లేదంటే స్నేహితుడు పరిమితికి మించి మద్యం తాగి కారు నడుపుతున్నారా? పక్క సీట్లో మీరు కుర్చున్నారా? పోలీసుల తానికీల్లో పట్టుబడితే జైలుకి వెళ్లడం తప్పదు అంటూ ప్రచారం చేస్తున్నారు.

మద్యం తాగిన వ్యక్తి కారు నడుపుతున్నాడన్న విషయం తెలిసీ ఆ వాహనంలో ప్రయాణించడం నేరమని పోలీసులు పేర్కొంటున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను తప్పక పాటించాల్సిందేనన్నారు. కాబట్టి వాహనదారులు మీరు తాగకపోయినా మీ ఫ్రెండు తాగి కారు నడిపినా మీరు పక్క సీట్లో ఉంటె జైలుకి వెళాల్సి వస్తుందేమో. కాబట్టి జాగ్రత్త!

Related News