logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

వాహనదారులకు ఝలక్: రోడ్లపై ఇలా పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగం లేనట్టే!

నగర వాసులకు హైదరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇక మీదట ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకు వెళ్లడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఇందుకు సంబంధించిన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చని అంటున్నారు. ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జీవితకాలం మనోవేదన చెందేలా చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే కదా ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ.

ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్దమవుతున్నారో వారిపై ఈ కొత్త నిబంధనల ప్రభావం గట్టిగానే ఉండనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా గుర్తించనున్నారు. అంతేకాదు భవిష్యత్తులో విదేశాలకు వెళ్లేందుకు కీలకమైన వీసా, పాస్ పోర్టుల విషయంలో కూడా వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

2021 మార్చి నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2 వేల మంది పట్టుబడగా అందులో కొందరిపై చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరికొందరికి మొత్తంగా 1.99 లక్షల జరిమానా విధించామని తెలిపారు. ఈ నిబంధనల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడంతో పాటుగా ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాలకు ఎంట్రీ ఉండదు. ఈ విధంగా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారికోసం పకడ్బందీగా ప్రణాలికను రూపొందిస్తున్నారు.

Related News