logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌లైన నాటి నుంచి మూడో ర‌కాల ప‌రిశోధ‌న‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఒక‌టి వైర‌స్ రాకుండా నియంత్రించే వ్యాక్సిన్ త‌యారీ ప‌రిశోధ‌న‌లు కాగా, మ‌రొక‌టి క‌రోనా చికిత్స‌కు సంబంధించిన‌వి. ఇక మూడో ర‌కం ప‌రిశోధ‌న‌లు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌వి. క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డంలో ప్ర‌పంచ‌మంతా ఏకాభిప్రాయంతో టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్ అనే ప‌ద్ధ‌తిని పాటిస్తున్నాయి.

అంటే క‌రోనా అనుమానితుల‌ను వేగంగా గుర్తించ‌డం, ప‌రీక్షించ‌డం, వారికి చికిత్స అందించ‌డ‌మే ఈ విధానం. క‌రోనా మొద‌లైన కొత్త‌లో ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌డం చాలా క‌ష్టంగా ఉండేది. మ‌న ద‌గ్గ‌ర క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం క‌లిగిన ల్యాబులు ఉండేవి కాదు. ఆర్టీపీసీఆర్ ప‌ద్ధ‌తిలో టెస్టులు జ‌రిగేవి. మ‌న ద‌గ్గ‌ర శాంపిళ్ల‌ను సేక‌రించి పూణేలోని నేష‌న‌ల్ వైరాల‌జీ ఇన్‌స్టిట్యూట్‌కి పంపిస్తే మూడు, నాలుగు రోజుల‌కు ఫ‌లితాలు వ‌చ్చేవి.

కానీ, ఇప్పుడు మ‌న ద‌గ్గ‌రే అనేక ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ల్యాబులు అందుబాటులోకి వ‌చ్చాయి. ప‌లు కొత్త ప‌రీక్ష విధానాలు సైతం అందుబాటులోకి వ‌చ్చాయి. ఆర్టీసీపీఆర్‌తో పాటు ట్రూనాట్‌, యాంటీజెన్ వంటి ప‌రీక్ష‌లు కూడా చేస్తున్నారు. అయితే, ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌ల్లో మాత్రం క‌చ్చితత్వంతో రిజ‌ల్ట్ వ‌స్తుంది. మిగ‌తా ప‌రీక్ష‌ల్లో వంద శాతం క‌చ్చితత్వంతో ఫ‌లితాలు రావు. అందుకే ఆ ప‌రీక్ష‌లు చేయించుకున్నా మ‌ళ్లీ ఆర్టీపీసీఆర్ చేయించుకుంటున్నారు.

ఇప్పుడు ఈ బాధ పూర్తిగా తొల‌గిపోనుంది. క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం దేశంలో అందుబాటులోకి వ‌చ్చింది. సీఎస్ఐఆర్ సంస్థ‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ ఆండ్ ఇంటిగ్రేటెడ్ బ‌యాల‌జీ, టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ కొత్త ప‌రీక్షా విధానాన్ని రూపొందించాయి. ఇది పేప‌ర్ స్ట్రిప్ ఆధారిత ప‌రీక్ష‌. గ‌ర్భ‌నిర్ధార‌ణ ప‌రీక్ష మాదిరిగా ఉంటుంది. లాలాజ‌లంతో ఈ ప‌రీక్ష జ‌రుపుతారు.

సేక‌రించిన శాంపింల్‌ను ఈ పేప‌ర్ స్ట్రిప్‌పై ప‌రీక్షించిన‌ప్పుడు పాజిటీవ్ అయితే స్ట్రిప్ రంగు మారుతుంది. ఇలా సులువుగా క‌రోనా నిర్ధార‌ణ జ‌రుగుతుంది. జీన్ ఎడిటింగ్ అనే ప‌రిజ్ఞానంతో ఈ ప‌రీక్ష చేస్తారు. కేవ‌లం గంట‌లోపే ప‌రీక్ష ఫ‌లితాలు తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. ఖ‌ర్చు కూడా చాలా త‌క్కువ అవుతుంది. కేవ‌లం రూ.500కే ప‌రీక్ష జ‌ర‌ప‌వ‌చ్చు.

ఈ ప‌రీక్ష‌కు ఫెలూదా అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్ట‌డానికి ఆస‌క్తిక‌ర కోణం ఉంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స‌త్య‌జీత్ రే సృష్టించి డిటెక్టీవ్ పాత్ర పేరు ఫెలూదానే ఈ ప‌రీక్ష‌కు పెట్టారు. ఈ ప‌రీక్ష విధానానికి ఐసీఎంఆర్ ఆమోదం తెలియ‌జేసింది. 96 శాతం క‌చ్చిత‌త్వంతో ఈ ప‌రీక్ష ఫ‌లితాలు ఉంటాయ‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించారు.

ఫెలూదా ప‌రీక్ష చేయించుకున్న వారు మ‌ళ్లీ ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవాల్సిన అవ‌స‌రం కూడా లేద‌ని ఐసీఎంఆర్ తెలియ‌జేసింది. ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవ‌డానికి ప్ర‌స్తుతం రూ.1600 అవుతుండ‌గా ఫెలూదా ప‌రీక్ష రూ.500తోనే చేయించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ ప‌రీక్ష అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related News