logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

షాకింగ్: కరోనా లక్షణాల జాబితాలో మరొకటి..!

ఇప్పటివరకు జ్వరం, అలసట, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారటం, పొడి దగ్గు వంటివి కరోనా లక్షణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఇక మొన్నటికి మొన్న రుచి, వాసన చూడలేకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాల జాబితాలో వచ్చి చేరాయి.

తాజాగా మరో షాకింగ్ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కెనడా శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం కంటి సమస్యలు తలెత్తినా కరోనా లక్షణాలుగా పరిగణించవలసి ఉంటుందట. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కంటి కార్నియా పొరల్లో వాపు, కంటి ఇన్ఫెక్షన్, కళ్లు ఎర్రబడటం, కళ్ల కలక వంటి ప్రాథమిక లక్షణాలు కూడా ఉన్నాయని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కార్లోస్‌ సోలర్టె వెల్లడించారు.

ఎడ్మంటన్‌ నగరంలోని రాయల్ అలెగ్జాండ్రా ఆసుపత్రిలో కంటి సమస్యలతో చేరిన 29 ఏళ్ల మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందన్నారు. కరోనా రోగుల్లో 10 నుంచి 15 శాతం రోగులు ఈ లక్షణాలు కలిగి ఉన్నారన్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. .

Related News