తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోకి బ్రిటన్ కొత్త స్ట్రెయిన్ ఎంటరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరో బ్రిటన్ స్ట్రెయిన్ కు సంబందించిన కరోనా కేసు వెలుగుచూసింది. ఈ వార్త ఇప్పుడు నగరవాసుల్లో కలకలం రేపుతోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివారాలు అధికారులు సేకరించి వారిని క్వారెంటైన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు జీహెచ్ఎంసీ పరిధిలోవెలుగు చూసిన కొత్త కేసులో కూడా ఆ మహిళ ఇటీవల యూకే నుంచి నగరానికి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే తాజా కేసులపై అటు రాష్ట్ర ప్రభుత్వంగానీ కేంద్ర ప్రభుత్వం గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజాగా నమోదైన కేసుతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు రెండుకు చేరుకున్నాయి. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కొత్త వేరియంట్ కరోనా లక్షణాలు ఉండటం గుర్తించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని వరంగల్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సీసీఎంబీలో నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సీ లో ఈ కేసు వెలుగు చూసింది.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 20 కి చేరుకుంది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు యూకే నుంచి ఇండియాకు 33 వేల మంది ప్రయాణికులు వచ్చినట్టుగా కేంద్రం వెల్లడించింది. వారిలో డిసెంబర్ 9-22 మధ్యలో భారత్ కు వచ్చిన వారికి జీనోమ్ సీక్వెన్సీ టెస్ట్ నిర్వహించాలని కేంద్ర నిర్ణయించింది.
ఈ టెస్టుల్లో ఇప్పటివరకు ఢిల్లీ ల్యాబ్ కి పంపినవారిలో మొత్తం 8 మందికి కొత్త కరోనా సోకింది. బెంగుళూరు ల్యాబ్ నుంచి అందిన నివేదిక ప్రకారం మరో 7 మందికి ఈ కొత్త స్ట్రెయిన్ నిర్దారణ అయ్యింది. దేశంలోని ఇతర నగరాలలో మరో 5 మందికి కూడా కొత్త కరోనా లక్షణాలు బయటపడ్డాయి.