logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

పాత రేడియోల్లో ఉండే వాల్వుల్లో బంగారం ఉంటుంద‌ని ప్రచారం

మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసే వారు కొత్త కొత్త మోసాలు చేస్తూనే ఉంటారు. ఈ మ‌ధ్యకాలంలో గోదావ‌రి జిల్లాలో పాతకాలం రేడియోలు, టీవీల్లో ఎర్ర‌టి ఎల‌క్ట్రానిక్ వాల్వుల్లో రెడ్ మిక్స‌ర్ బంగారం ఉంటుంద‌నే ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వాట్సాపుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ వాల్వులు విలువైన‌వి కాబ‌ట్టి సేక‌రిస్తే పెద్ద ఎత్తున డ‌బ్బులు వ‌స్తాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో కొంద‌రు ఈ ప్ర‌చారాన్ని నిజ‌మే అని నమ్ముతున్నారు.

కొంద‌రైతే ఏకంగా త‌మ ప్రాంతంలోని రేడియో, టీవీ మెకానిక్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఎర్ర‌టి వాల్వ్ ఫోటో చూపిస్తూ మీ ద‌గ్గ‌ర ఉన్న పాత రేడియో, టీవీల్లో ఈ వాల్వ్‌లు ఉన్నాయా అని అడుగుతున్నారు. కాగా, ఇలా అడుగుతున్న వారిలో చ‌దువుకున్న వారు సైతం ఉంటున్నార‌ట‌. ప్ర‌తిరోజూ ఇలా తమ వ‌ద్ద‌కు వ‌చ్చి ఇలా వాల్వ్‌ల గురించి అడుగుతుండ‌టంతో పాటు కొంద‌రు ఈ ప్రచారంతో మోసపోతున్నార‌ని తెలుసుకున్న ఏపీ టీవీ, ఎల‌క్ట్రానిక్ మెకానిక్స్ వెల్ఫేర్ యూనియ‌న్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

రెడ్ మిక్స‌ర్ బంగారం ఉంటుంది అని ప్ర‌చారం జ‌రుగుతున్న వాల్వ్‌ను రాష్ట్రంలో ఉన్న మెకానిక్‌లు ఎవ‌ర‌మూ ఇంత‌వ‌ర‌కు చూడ‌లేద‌ని వారు పేర్కొన్నారు. ఇటువంటివి త‌మ వ‌ద్ద ల‌భించే అవ‌కాశ‌మే లేద‌ని, కాబ‌ట్టి ఈ త‌ప్పుడు ప్ర‌చారాలు న‌మ్మి డ‌బ్బును, స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌ద్ద‌ని వారు కోరుతున్నారు. అయినా, ఇటువంటి వాల్వులు కేవ‌లం గాజు గొట్టాలేన‌ని, వీటిలో ఎటువంటి ద్ర‌వం ఉండ‌ద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు.

Related News