logo

  BREAKING NEWS

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |  

క‌రోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త స‌మ‌స్య‌

క‌రోనా వైర‌స్ పుట్టి ఏడాది గ‌డిచింది. అప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ పుట్టుపుర్వోత్త‌రాలు, ప్ర‌భావం, చికిత్స‌, నివార‌ణ‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. క‌రోనా వైర‌స్ నుంచి కోలుకోవ‌డం సులువే కానీ కోలుకున్న త‌ర్వాత భ‌విష్య‌త్‌లో కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా, ఇటువంటిదే మ‌రో విష‌యం తేలింది. క‌రోనా బారిన ప‌డిన కొంద‌రిలో కంటిచూపు మంద‌గిస్తోంద‌ని మ‌న వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. కోవిడ్ వ‌ల్ల కంటి న‌రంలో కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని, దీని వ‌ద్ద కంటి చూపు త‌గ్గుతోంద‌ని వైద్య‌లు చెబుతున్నారు. కోవిడ్ బారిన స్టెరాయిడ్స్ వాడి కోలుకున్న వారిలో ఇటువంటి స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని గుర్తించారు.

కంటి నాళాల్లో గ‌డ్డ‌ల వ‌ల్ల రెటీనాకు జ‌రిగే ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. కంటి న‌రంలో వాపు రావ‌డం, ఆప్తిక్ న‌రం స‌మ‌స్య‌లు, మెద‌డు నుంచి కంటికి ఉండే న‌రంలో ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. దీని వ‌ల్ల ఒక్క‌సారిగా చూపు మ‌స‌క‌బారే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. కాబ‌ట్టి, కరోనా నుంచి కోలుకున్న వారిలో కంటి స‌మ‌స్య‌లు వస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

ఈ మేర‌కు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. కంటి వైద్యానికి సంబంధించి వైద్యుల‌కు ప‌లు సూచ‌న‌లు చేసింది. కంటి ఆసుప‌త్రులకు నేరుగా వ‌చ్చే రోగుల సంఖ్య‌ను త‌గ్గించేందుకు టెలీక‌న్స‌ల్టేష‌న్ ప‌ద్ధ‌తిని పాటించాల‌ని సూచించింది. కంటికి సంబంధించిన ఆప‌రేష‌న్ చేసే ముందు క‌చ్చితంగా కోవిడ్ ప‌రీక్ష చేయించాల‌ని చెప్పింది.

కంటైన్‌మెంట్ జోన్ల‌లో కంటి ఆసుప‌త్రుల‌ను తెర‌వ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. కంటి స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగుల పూర్తి వివ‌రాలు తీసుకోవాల‌ని కంటి ఆసుప‌త్రుల‌కు ఆదేశాలు ఇచ్చింది. డిజిట‌ల్ ప్రిస్క్రిప్ష‌న్ ప‌ద్ధ‌తిని పాటించాల‌ని సూచించింది. క‌రోనా నేప‌థ్యంలో కంటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రోగులు అత్య‌వ‌స‌రం అనుకుంటేనే ఆసుప‌త్రుల‌కు వెళ్లాల‌ని, లేక‌పోతే టెలీక‌న్స‌ల్టేష‌న్ ద్వారా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని కేంద్రం సూచించింది.

Related News