logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!

2019 ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ స్థానంలో సోనియా గాంధీ తాత్కాలికంగానే కొనసాగారు. కానీ పార్టీకి పార్టీ స్థాయి అధ్యక్షుడు అవసరం అని డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అనే ప్రశ్న కొంతకాలంగా వినిపిస్తుంది.

నాయకత్వలేమి కారణంగా పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే విధంగా సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ లోపు కొత్త అధ్యక్షుడి ఎన్నికను పూర్తి చేస్తామని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మే 29న అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో భాగంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కమిటీ.

కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమించి వాక్సిన్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైతులకు మద్దతుగా నిలవాలని నిర్ణయించుకుంది. అదే విధంగా సంచలనంగా మారిన రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్ణబ్ గోస్వామి చాట్ లీక్ పై కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని సీడబ్ల్యూసీ సూచించింది.

Related News