logo

Khiladi, RRR, Bheemla Nayak, Radheshyam, KGF-2, Sarkaru Vaari Paata, Acharya రిలీజ్ డేట్లు ఇవే

క‌రోనా కార‌ణంగా కొన్ని రోజులుగా పెద్ద సినిమాల రిలీజ్‌లు లేక సినిమా అభిమానులు నిరాశ చెందుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌ల్ల వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు అన్ని సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కు సినిమాల జాత‌ర సాగ‌నుంది. అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. మ‌రి, ఏ డేట్ రోజు ఏ సినిమా రిలీజ్ కానుందో ఈ వీడియోలో చూద్దాం.

మాస్ రాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఖిలాడి సినిమా ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ కానుంది.

త‌మిళ స్టార్ హీరో అజీత్ న‌టించిన వాలిమై చిత్రం ఫిబ్ర‌వ‌రి 24న రిలీజ్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహ‌ర్లు సినిమా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రానా హీరోలుగా తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్‌ భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న‌ లేదా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ముంబై రెడ్‌లైట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన గుంగూబాయి క‌థియావాది సినిమా కూడా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ కానుంది.

ప్ర‌భాస్ న‌టించిన మోస్ట్ వెయిటింగ్ ప్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ మార్చ్ 11న ఇండియావైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాల్సి ఉంది.

రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టించిన ప్యాన్ ఇండియా మ‌ల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇది అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

శ‌ర‌త్ మండ‌వ డైరెక్ష‌న్‌లో ర‌వితేజ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా మార్చ్ 25న రిలీజ్ కానుంది.

య‌ష్ హీరోగా తెర‌కెక్కిన కేజీఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానుంది.

వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎఫ్ 3 సినిమాను ఏప్రిల్ 28 రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అనౌన్స్ చేశారు.

మ‌హేశ్ బాబు హీరోగా తెర‌కెక్కిన‌ స‌ర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ కానున్న‌ట్లు అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.

Related News