logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

తెలంగాణలో కొత్త మండలం.. కేసీఆర్ కీలక నిర్ణయం!

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నా సిద్ధిపేట జిల్లాను ఆయన ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న మండలాలకు అదనంగా ధూళిమిట్టను మండలంగా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు మద్దూరు మండలం కింద ఉన్న ఎనిమిది గ్రామాలూ బుధవారం నుంచి ధూళిమిట్ట పరిధిలోకి రానున్నాయి. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ డివిజన్ మద్దూరు మండలంలోని కమలాయపల్లి, అర్జునట్ల గ్రామాలను సిద్ధిపేట డివిజన్ లోని చేర్యాల మండలానికి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ మండలంలో ధూళిమిట్ట,లింగాపూర్‌, జాలపల్లి, తోర్నల, బైరాన్‌పల్లి, బెక్కల్‌, కొండాపూర్‌, కూటిగల్ గ్రామాలను కలిపారు.

Related News