logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఈ కాటన్ మాస్కులు ధరిస్తే గంటలో కరోనా ఖతం..!

కరోనా నుంచి మనల్ని రక్షించేవి భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడమే. దీంతో మార్కెట్లో వివిధ రకాల మాస్కులను అందుబాటులోకి తెస్తున్నారు. ఎంత మాస్కు ధరించినా అవి 4 గంటల కన్నా ఎక్కువ సమయం రక్షణ ఇవ్వలేవని, వైరస్ మాస్కుపై చేరితే అది ముక్కు నోరు ద్వారా ఎదో విధంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటున్నారు.

దీంతో ఇప్పుడు కరోనా నుంచి రక్షణనిచ్చే కొత్త రకం మాస్కులను తయారు చేస్తున్నారు పరిశోధకులు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చెందిన పరిశోదన బృందం తయారు చేసిన ఈ కాటన్ మాస్కును ధరిస్తే.. ఒకవేళ కరోనా వైరస్ మాస్కుపై చేరినా 99.99 శాతం ఈ మాస్కు వైరస్ ను చంపుతుంది అంటున్నారు. అయితేమనం చేయాల్సిందల్లా ఈ మాస్కు ధరించి 60 నిమిషాల పాటు సూర్య రష్మి తగిలేలా ఉండటమే.

సూర్యకిరణాలు పడిన వెంటనే ఈ మాస్కు రీయాక్టివ్ ఆక్సిజన్ స్పైసెస్ ను విడుదల చేస్తుంది. దీంతో అవి వైరస్ ను చంపేస్తుంది. ఈ ప్రక్రియ జరగాలంటే దీనికి ఎండ తగలాలి. అయితే ఈ మాస్కులను ఏడు సార్ల వరకు సార్లు ఉతికి ధరించే విధంగా తయారు చేసారు. ఈ సరికొత్త కాటన్ మాస్కు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఈ మాస్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధక బృందం భావిస్తుంది.

Related News