logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

ఏమిటీ కొత్త క‌రోనా వైర‌స్ ? ప్ర‌మాద‌క‌ర‌మా ? ప‌రిష్కార‌మేంటి ?

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంద‌నే అభిప్రాయాలు ఒక వైపు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌రుస‌గా అందుబాటులోకి వ‌స్తున్న క‌రోనా వ్యాక్సిన్‌లు వైర‌స్‌ను జ‌యిస్తామ‌ని ఆశ‌లు క‌ల్పిస్తున్నాయి. ఇక క‌రోనా పీడ విర‌గ‌డైతుంది అనుకుంటుండ‌గా బ్రిట‌న్‌లో విజృంభిస్తున్న కొత్త ర‌కమైన క‌రోనా వైర‌స్ ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న క‌లిగిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త క‌రోనా వైర‌స్ ప‌ట్ల అన్ని దేశాల్లో ఆందోళ‌న మొద‌లైంది.

ఏమిటీ కొత్త క‌రోనా స్ట్రెయిన్ ?
ఏదైనా వైర‌స్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. వైరస్ అనేక ఉత్పరివర్తనలకు లోనవుతూనే ఉంటుంది. అంటే తన జన్యునిర్మాణం, ఆకారం, ప్రవర్తన, గుణం రకరకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. దీనినే స్ట్రెయిన్ అంటారు. క‌రోనా వైర‌స్ కూడా ఇలా అనేక మార్పుల‌కు లోన‌వుతూ ఉంది. వైరస్ పునరుత్పత్తి ఫలితంగా జన్యు క్రమంలో కలిగే మార్పుల వల్ల ఈ మ్యుటేషన్ జరుగుతుంది. క‌రోనా వ‌చ్చిన ఏడాదిలో వైర‌స్‌లో అనేక మ్యుటేష‌న్లు వ‌చ్చాయి. ఇలా జ‌రిగిన చాలా మ్యుటేషన్లు అంత ప్రమాదకరమైన‌వి ఏమీ కావు. ఇటీవ‌ల‌ సౌతాఫ్రికాలో 501.V2 అనే క‌రోనా వేరియంట్‌ను కనుగొన్నారు. ఇది ఎక్కువ‌గా యువతపై చూపిస్తోంది. ఇప్పుడు బ్రిట‌న్‌లో క‌నుగొన్న ఈ కొత్త రకం వైరస్‌ను VUI-202012/01గా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

మిగ‌తా వేరియెంట్ల క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మైన‌దా ?
బ్రిట‌న్‌లో విజృంభిస్తున్న కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న క‌రోనా వైర‌స్ ర‌కం కంటే ఈ కొత్త ర‌కం వైర‌స్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, ఇట‌లీ, డెన్మార్క్ వంటి దేశాల్లో ఈ కొత్త ర‌కం వైర‌స్ వేరియెంట్ వ్యాపించిన‌ట్లు గుర్తించారు. బ్రిట‌న్‌లో కొన్ని రోజుల క్రింద ఈ కొత్త వేరియెంట్ క‌రోనా కేసులు కేవ‌లం 15 శాతం ఉండ‌గా ఇప్పుడు మొత్తం కేసుల్లో ఈ కొత్త వేరియెంట్ కేసులే 60 శాతం ఉన్నాయంటే ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే, ఈ కొత్త ర‌కం వైర‌స్ గ‌తంలోని వైర‌స్ కంటే ప్రాణాపాయం ఏమీ కాద‌ని మాత్రం శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

ఏమిటి ప‌రిష్కారం ?
కరోనా వైరస్ మనిషి శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కొత్తగా మ్యుటేట్ చెందగలుగుతుంది. కాబట్టి మ‌ళ్లీ మ‌ళ్లీ మ్యుటేట్ కాకుండా ఉండాలంటే ప్రస్తుతం ఉన్న వైరస్ స్ట్రెయిన్లను వీలైనంత తొందరగా శరీరంలో నాశనం చేయాలి. వీలైనంత త్వరగా వేరే వ్యక్తికి సోకకుండా చేయాలి. ఇది చేయాలంటే ఉన్న ఏకైక మార్గం… వాక్సినేషన్‌‌. వాక్సిన్ వేసుకున్న వారిలో ముందుగానే వైరస్‌ని నాశనం చేసే యాంటీబాడీస్ ఏర్పడి ఉంటాయి కాబట్టి శరీరంలోకి కొత్తగా వైరస్ ఎంటరైనా వెంటనే నాశనమౌతుంది.

Related News