logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌గ్గుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుతోంది. కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య త‌గ్గుతుండ‌టంతో పాటు కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో మొత్తం 8,388 సాంపిల్స్ పరీక్షించగా 43 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. గ‌త 15 రోజుల్లో ఇంత త‌క్కువ కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. గ‌త వారం రోజులుగా కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో టెస్టుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 1,930 పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా 44 మంది మ‌ర‌ణించారు. 887 మంది క‌రోనా నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం 999 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో 45 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణ జిల్లాలో ఇద్దరు మరియు కర్నూల్‌లో ఒక్కరు మరణించారు. గ‌త 24 గంట‌ల్లో కృష్ణ‌లో 16, చిత్తూరులో 11, క‌ర్నూలులో 6, విశాఖ‌‌ప‌ట్నంలో 5, అనంత‌పురంలో 3, గుంటూరులో 2 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

మొత్తంగి ఇప్ప‌టివ‌ర‌కు క‌ర్నూలులో 553, గుంటూరులో 376, కృష్ణాలో 338, చిత్తూరులో 96, అనంత‌పురంలో 102, క‌డ‌ప‌లో 96, ప‌శ్చిమ గోదావ‌రిలో 68, విశాఖ‌ప‌ట్నంలో 62, ప్ర‌కాశంలో 61, తూర్పు గోదావ‌రిలో 46, విజ‌య‌న‌గ‌రంలో 4, శ్రీకాకుళంలో 5 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇత‌ర‌(గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క నుంచి వ‌చ్చిన వారు) 27 కేసులు న‌మోద‌య్యాయి.

Related News