logo

  BREAKING NEWS

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |  

దేశంలో మరోసారి కరోనా కలవరం.. ఆ ఐదు రాష్ట్రాలకు వెళ్లేవారు జాగ్రత్త!

దేశంలో మరోసారి కరోనా కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ 5 రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతుంది. అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు ప్రజలకు కరోనా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 75 శాతానికి పైగా ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో ఒక్క రోజే 6 వేల 112 కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పంజాబ్ లో 383, మధ్యప్రదేశ్ లో 297 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి రెండో నెల నుంచి మధ్యప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా ముంబైలో లోకల్ ట్రైన్లు ప్రారంభించిన తర్వాత పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నటుగా అధికారులు గుర్తించారు. ప్రజలంతా ఈ కరోనా చైన్ ను విడగొట్టేందుకు సహకరించాలని మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News