logo

  BREAKING NEWS

బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |  

బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు వీరే!

దేశవ్యాప్తంగా పలువురు సీజేలు, న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మొత్తం నాలుగు రాష్ట్రాల్లో 9 మంది సీజేలు, అయిదుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల హై కోర్టులకు ఏక కాలంలో కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల్లో బదిలీలను చేపడుతూ సుప్రీం కోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఈమె ప్రస్తుతం ఢిల్లీ హై కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ సీజేగా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేసారు. ప్రస్తుతం సిక్కిం హై కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న అరూప్ గోస్వామిని ఏపీ హై కోర్టు సీజేగా బదిలీ చేసారు.

ప్రస్తతం ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహేశ్వరిని సిక్కిం కు బదిలీ చేసారు. ఏపీ హై కోర్టు న్యాయమూర్తిగా జొయ్ మాల్యా బాగ్చి రానున్నారు. తెలంగాణ జస్టిస్ గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 23 జూన్ 2019 నుంచి సేవలు అందిస్తున్నారు. కాగా ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జీకే మహేశ్వరీ 7 అక్టోబర్ 2019 నుంచి సేవలు అందిస్తున్నారు.

Related News