logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు

తెలుగుదేశం పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కింజార‌పు అచ్చెన్నాయుడు పేరు ఖ‌రారైంది. సెప్టెంబ‌ర్‌ 27వ తేదీన చంద్ర‌బాబు నాయుడు అచ్చెన్నాయుడు పేరును అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు ప్ర‌స్తుతం టెక్క‌లి నుంచి శాస‌న‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. అసెంబ్లీలో తెలుగుదేశం శాస‌న‌స‌భాప‌క్ష ఉప నేత‌గా కూడా ఆయ‌న కొన‌సాగుతున్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో అచ్చెన్న మంత్రిగా కూడా ప‌ని చేశారు.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం అచ్చెన్నాయుడు సొంతం. ఆయ‌న హ‌రిశ్చంద్ర‌పురం శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు ప‌ర్యాయాలు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ర‌ద్దు కావ‌డంతో టెక్కలికి మారారు. టెక్క‌లి నుంచి రెండుసార్లు ఓడినా 2014, 1019 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించారు. దివంగ‌త తెలుగుదేశం పార్టీ కీల‌క నేత ఎర్ర‌న్నాయుడు త‌మ్ముడు ఈయ‌న‌. అన్న ప్రోత్సాహంతోనే అచ్చెన్న రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి క్ర‌మంగా ఎదిగారు.

ఎర్ర‌న్న కుటుంబం నుంచి ఇప్ప‌టికే అచ్చెన్న ఎమ్మెల్యేగా ఉండ‌గా ఎర్ర‌న్న కుమారుడు రామ్మోహ‌న్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, కుమార్తె ఆదిరెడ్డి భ‌వాని రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తుండ‌టంతో ఆ పార్టీలో ఎర్ర‌న్న కుటుంబానికి మ‌రింత ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్ల‌య్యింది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చుకున్నారు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు నాయుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నారా లోకేష్ కొన‌సాగుతున్నారు. ఏపీ, తెలంగాణ‌కు వేర్వేరు అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. గ‌త ఆరేళ్లుగా శ్రీకాకుళం జిల్లాకే చెందిన కిమిడి క‌ళా వెంక‌ట్రావు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను మార్చాల‌ని అనుకున్న‌ప్పుడు అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు ఇవ్వాల‌ని చంద్రబాబు మొగ్గు చూపారు.

అచ్చెన్నాయుడు నియామ‌కం ద్వారా పార్టీకి ప‌ట్టున్న ప్రాంత‌మైన‌ ఉత్త‌రాంధ్ర‌కు పార్టీలో త‌గిన‌ ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని భావించారు. మ‌రి కొన్ని అంశాలు కూడా అచ్చెన్నాయుడు నియామ‌కానికి క‌లిసి వ‌చ్చాయి. అచ్చెన్నాయుడు బీసీ నేత‌. కొప్పుల వెల‌మ సామాజ‌క‌వ‌ర్గానిక చెందిన నేత‌. పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు ఓసీ నేత ఉండ‌టంతో రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని బీసీకి ఇవ్వ‌డం ద్వారా బీసీల‌కు పార్టీలో ప్రాధాన్య‌త ఉంటుంద‌ని నిరూపించాల‌నే ఆలోచ‌న‌తో చంద్ర‌బాబు ఉన్నారు.

అసెంబ్లీలో టీడీఎల్పీ ఉప నేత‌గా అచ్చెన్నాయుడు అధికార వైసీపీని ఢీకొంటున్నారు. మిగ‌తా ఎమ్మెల్యేల కంటే అచ్చెన్న ఈ విష‌యంలో ముందుంటున్నారు. త‌ద్వారా ఆయ‌న వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఇటీవ‌ల ఆయ‌న ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో అరెస్టు కూడా అయ్యారు. దీంతో పార్టీ కోసం ఎంత‌కైనా వెన‌కాడ‌కుండా శ్ర‌మిస్తున్న‌ అచ్చెన్నాయుడుకు ఈ ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా మ‌రింత ప్రోత్స‌హించాల‌ని చంద్ర‌బాబు భావించారు. అందుకే ఆయ‌న పేరును ఖ‌రారు చేశారు.

Related News