logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పాపం.. కొన్న మూడు నెల‌ల‌కే న‌డిరోడ్డుపై కాలిపోయిన కారు

ఓ వ్య‌క్తి ఎన్నో క‌ల‌లు క‌ని, క‌ష్టార్జితాన్ని రూపాయి రూపాయి ఆదా చేసుకొని కొనుక్కున్న కారు మూడు నెల‌ల‌కే కాలిపోయింది. మ‌ల్కాజ్‌గిరి విమ‌లాదేవి న‌గ‌ర్‌కు చెందిన వెంక‌ట్‌రెడ్డి అనే వ్య‌క్తి మూడు నెల‌ల క్రితం కుషాయిగూడ‌లోని ఓ షోరూంలో రెనౌల్ట్ క్విడ్ కారును కొనుగోలు చేశారు. ఇవాళ కారులో ప‌నిపై బ‌య‌ట‌కు వెళ్ల‌గా మ‌ల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ ప్రాంతంలో కారులో ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న వారు అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే దిగిపోవ‌డంతో సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కారు పూర్తిగా ద‌‌గ్ధ‌మైంది. కారు కొన్న మూడు నెల‌ల‌కే న‌డిరోడ్డుపైన కాలిపోవ‌డంపై కారు ఓన‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌య‌మై కారు కొనుగోలు చేసిన షోరూంకు ఫోన్ చేసినా స‌రిగ్గా స్పందించ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు.

Related News