logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

పుట్టినరోజు నాడు స్టార్ హీరోకి ఊహించని షాక్.. అరెస్టుకు డిమాండ్!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక వైపు హీరోగా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాత్రల్లో, విలన్ గా కూడా సత్తా చాటుతున్నాడు. ఇటీవల విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ‘మాస్టర్’ సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ ఈ హీరో నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలందుతున్నాయి.

అయితే శనివారం రోజున (జనవరి 16) ఈ హీరో తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ కు ఊహించని షాక్ తగిలింది.తన పుట్టిన రోజు సందర్భంగా ఈ హీరో షేర్ చేసిన ఓ ఫోటో పై వివాదం చెలరేగుతుంది. తన బర్త్ డే కేక్ ను తల్వార్ (పెద్దకత్తి)తో కట్ చేస్తూ ఉన్న ఫోటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ చర్య యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని అంటున్నారు. గతంలో ఇలాంటి ఘటనలో కొందరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే సామాన్యులకు ఒక న్యాయం సెలెబ్రెటీలకు ఒక న్యాయమా? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వెంటనే విజయ్ సేతుపతి అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించాడు. తాను షేర్ చేసిన ఫోటో పై క్షమాపణలు కోరాడు. తన రాబోయే సినిమాలో ఇలాంటి నేపథ్యం ఒకటి ఉందని అందుకే అలా చేశామని వివరణ ఇచ్చాడు. తాను ఇలా చేయడం ఎవరి మనోభావాలనైనా బాధించి ఉంటె క్షమించాలని ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని తెలిపాడు.

Related News