logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

సుశాంత్ మృతిపై స్పందిస్తూ మేకప్.. అభాసుపాలైన ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరు సుశాంత్ ను తలుచుకుంటూ కంట తడి పెట్టుకుంటున్నారు. అయితే సుశాంత్ మరణం గురించి మాటాడుతూ ఓ సినీ హీరోయిన్ చేసిన పనికి ఇప్పుడు ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతి పై ఓ టీవీ కార్యక్రమంలో చర్చ జరుగుతున్న సమయంలో ఆమె లైవ్ విషయం గమనించకుండా మేకప్ చేసుకోవడంతో అభాసుపాలయ్యింది.

ఆమె ఎవరో కాదు పూరి- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంజన గల్రాని. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ నటిని సుశాంత్ కు సంతాపం తెలుసుపుతూ జరుగుతున్న ఓ లైవ్ కార్యక్రమంలో మాట్లాడమని కనెక్ట్ చేసారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఆమె లైవ్ లో ఉన్న విషయం మరిచిపోయిందో ఏమో గాని మేకప్ కిట్ ను బయటకు తీసి మేకప్ చేసుకుంటూ కనిపించింది.

ఒక్క సారిగా స్క్రీన్ పై ఇలాంటి దృశ్యం కనిపించడంతో ప్రేక్షకులు షాకయ్యారు. ఈ వీడియో క్లిప్ ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్నారు. అంత విషాదకరమైన విషయం మాట్లాడుతున్న సమయంలో మేకప్ వేసుకోవడం అంత అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News