logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

‘సుశాంత్ ను వాళ్ళే చంపారు’.. కరణ్, అలియాలే టార్గెట్!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం సినీ పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలకనుందా? తాజా పరిస్థితులు చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతుంది. సుశాంత్ మరణాన్ని సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ ఒక మంచి నటుడిని కోల్పోయిందని సోషల్ మీడియాలో విపరీతంగా స్పందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఒక విషయంపై ట్విటర్ లో ఈ స్థాయిలో ఇండియన్స్ చర్చించుకోవడం ఇదే మొదటిసారి. కొందరు సుశాంత్ మరణానికి సంతాపం ప్రకటిస్తుంటే మరి కొందరు మాత్రం సుశాంత్ చావుకు కారణమంటూ బాలీవుడ్ వర్గాలపై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ హాష్ టాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

సినీ పరిశ్రమలో ఉన్న బందు ప్రీతి, ఫెవరేటిజమే సుశాంత్ ను బలి తీసుకుందని మండిపడుతున్నారు. బాలివుడ్ లో నేపోటిజం ఉందని ఖాన్ లు -కపూర్ లు- కరణ్ జొహార్ లాంటి వాళ్లే బాలీవుడ్ లో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో డిసైడ్ చేస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నా.. సుశాంత్ మరణంతో దీనిపై ఓ ఉద్యమమే మొదలయ్యేట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ నటి కంగనా రనౌత్ నెటిజన్లకు మద్దతుగా నిలవడంతో ఆమె పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ లో వివక్ష ఉందని దశాబ్దం కిందటే కంగనా గళం విప్పింది. గతంలో ‘కాఫీ విత్ కరణ్ ‘ షోలో పాల్గొన్న కంగనా.. ‘బాలీవుడ్ లో నేపోటిజానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ వి నా బయోపిక్ లో నీ పాత్ర తప్పకుండా ఉంటుంది. మీరంతా ఓ రకమైన మాఫియా’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఇప్పుడు సుశాంత్ మరణంతో ఆమె ఈ సమస్యపై మరింత పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో నెటిజన్లు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులనే టార్గెట్ చేస్తుండటం గమనార్హం. అందులో ఒకరు కరణ్ జోహార్ కాగా మరొకరు అలియా భట్. ఒక సందర్భంలో అలియా సుశాంత్ ఎవరో తనకు తెలియదని చెప్పింది. అందుకు పక్కనున్న కరణ్ జోహార్ కూడా పగలబడి నవ్వాడని వాపోతున్నారు. టీవీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టే అతన్ని చులకనగా చూసారని అంటుంటున్నారు. కరణ్ జోహార్ లాంటి వారు కేవలం స్టార్ కిడ్స్ కి మాత్రమే అవకాశాలు ఇస్తారని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని పట్టించుకోరని ట్రోల్ చేస్తున్నారు. ఇంటర్‌ కూడా పాస్‌ కాలేక పోయిన ఆలియా భట్‌ వంటి వారు స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగితే ఇంజనీరింగ్‌ లో జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంక్‌ ను దక్కించుకున్న సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మాత్రం ఇలా కెరీర్‌ లో ఒడిదొడుకులతో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు రణబీర్ కపూర్, వరుణ్ ధావన్,అనన్య పాండే లాంటి స్టార్ కిడ్స్ కూడా ట్రోల్ అవుతున్నారు.
అయితే అలియా భట్ తండ్రి మహేష్ భట్ సుశాంత్ మరణం పై చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.

‘సడక్ 2’ సినిమా కోసం సుశాంత్ ను కలిసిన సమయంలో అతను మానసికంగా కుంగిపోయినట్టు కనిపించాడట. ఇలాంటి ఒక రోజు వస్తుందని ముందే ఊహించా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లు సుశాంత్ కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అయినా సుశాంత్ తన సొంత టాలెంట్ తో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ సుశాంత్ పై అప్రకటిత నిషేధం విధించిందని ఫాన్స్ అంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. తనను బాలీవుడ్ సెలెబ్రిటీస్ ఎవరూ ఫ్యామిలీలా చూడరని.. పార్టీలకు పిలవరని.. దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఆ మాటలు సుశాంత్ అభిమానులను కలచివేస్తున్నాయి. ఇకపై బాలీవుడ్ లో ఈ వర్గానికి చెందిన వారి సినిమాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు.

Related News