logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

బంపర్ ఆఫర్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్.. ఫ్రీగా చూసేయండి!

భారతీయ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో మన దేశంలో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్ ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ ను చూసే అవకాశం కల్పిస్తుంది. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ వీడియోలు చూడాలంటే సబ్ స్క్రిప్షన్ చేసుకుని, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు అందించిన వారికీ మాత్రమే అనుమతి ఉంటుంది.

అయితే ఈ రెండు రోజులపాటు నిర్వహించే స్ట్రీమ్ ఫెస్ట్ లో భాగంగా ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కేవలం మన మెయిల్ ఐడీ తో లాగ్ ఇన్ అయితే సరిపోతుంది. నెట్ ఫ్లిక్స్ ఇచ్చే పాస్ వార్డ్ ను ఉపయోగించి అందులో ఉండే అన్ని రకాల సినిమాలు, వీడియోలను చేసేయవచ్చు.

గతంలో నెట్ ఫ్లిక్స్ 30 రోజుల పాటు ట్రయల్ వర్షన్ ను అందించేది. గతేడాది నుంచి భారత్ తో పాటుగా అన్ని దేశాల్లో ఈ తరహా ట్రయల్స్ ను నిలిపివేసింది. అయితే ఇప్పుడు మన దేశంలో ప్రయోగాత్మకంగా ఈ రెండు రోజుల స్ట్రీమింగ్ ను అందిస్తుంది. దీని ద్వారా నెట్ ఫ్లిక్స్ లో ఉండే కంటెంట్ ప్రేక్షకులకు చేరువ అవుతుందని వాటితో పాటుగా వారి సేవలు ఎలా ఉంటాయో చూసి మరింత ఎక్కవ మంది సబ్ స్క్రైబర్లు వస్తారని నెట్ ఫ్లిక్స్ భావిస్తుందని సంస్థ సీఈవో ఆశాభావం వ్యక్తం చేసారు.

Related News