logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్.. జీవిత కాలం ఉచిత సబ్ స్క్రిప్షన్.. ఎలాగో చుడండి!

కరోనా కారణంగా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలకు విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, నేటి ఫ్లిక్స్ ఇలా అనేక ఓటీటీ ప్లేట్ ఫార్మ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కొత్త సినిమాలను విడుదల చేస్తున్నాయి. అయితే ఇవి యూట్యూబ్ లాగా ఉచితంగా లభించవు. వీటికి నెలవారీగా కానీ ప్యాకేజీ ద్వారా కానీ కొంత డబ్బులు చెల్లించవలసి ఉంటుంది.

ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా నెలకొన్న పోటీని తట్టుకోవడానికి నెట్ ఫ్లిక్స్ తమ యూజర్లకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. జీవిత కాలం ఉచిత షబ్ స్క్రిప్షన్ ను అందించడానికి సిద్ధమైంది. అయితే అది అందరికీ కాదు నెట్ ఫ్లిక్స్ వారు రూపొందించిన ఒక గేమ్ ఆడి అందులో గెలుపొందిన వారికీ మాత్రమేఈ సువర్ణావకాశం దక్కుతుంది. ఈ గేమ్ లో విజయం సాధిస్తే 83 సంవత్సరా పాటు రూ. 9 లక్షల విలువైన సబ్స్క్రిప్శ ను ఉచితంగా అందిస్తుంది.

అందుకోసం ‘న్యూ ఓల్డ్ గార్డ్’ అనే గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ గేమ్ ఆడేముందు నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ‘ది ఓల్డ్ గార్డ్’ సినిమాను చూడాలని నెట్ ఫ్లిక్స్ సూచిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలోని సన్నివేశాల ప్రాతిపదికనే ఈ గేమ్ ను రూపొందించారట. ఈ గేమ్ లో గెలుపొందడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది.

 

Related News