logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |   హైద‌రాబాద్ వ‌ర‌ద‌లు.. భారీగా విరాళాలు ప్ర‌క‌టించిన హీరోలు  |   ఫిబ్ర‌వ‌రి నాటికి స‌గం మందికి క‌రోనా వైర‌స్‌  |   రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |  

రాముడు మావాడు.. అయోధ్య మాదే.. నేపాల్ కొత్త పంచాయతీ

భారత భూభగంలోని లిపులేక్, కాలాపాని ప్రాంతాలను తమవిగా చూపుతూ నేపాల్ కొత్త మ్యాపులను సృష్టించి కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నేపాల్ మరో కొత్త పంచాయతీకి తెర లేపింది. శ్రీరాముడు భారతీయుడు కాదు. భారత్ తమదిగా చెప్పుకుంటున్న రామజన్మభూమి నకిలీది. అసలైన అయోధ్య నేపాల్ లో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

తమ దేశం ఎన్నో ఏళ్లుగా సాంస్కృతిక దురాక్రమణకు గురైందన్నారు. ఇప్పటివరకు మా దేశానికి చెందిన సీత భారతీయ రాకుమారుడు శ్రీరాముడిని వివాహమాడినట్టుగా నమ్ముతున్నాం. అయితే అసలైన అయోధ్య భారత్ లో లేదు. నేపాల్ లోని బిర్గుంజ్‌ దగ్గర్లో గ్రామం థోరీలో ఉంది. అక్కడకు దగ్గర్లోనే వాల్మికీ ఆశ్రమం కూడా ఉంది. పుత్రుల కోసం దశరథుడు యాగం నిర్వహించిన చోటు రిధి, ఇది కూడా నేపాల్‌లోనే ఉంది. మా చరిత్రను కాలరాశారు.

అని నేపాల్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భారతీయుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని, నేపాల్- భారతీయ సోదరుల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ మండిపడుతుంది. ఇప్పటికే డ్రాగన్ దేశంతో చేతులు కలిపినా కేపీ ఓలి ఇప్పుడు మరో కొత్త పంచాయతీ ఎత్తుకున్నారని మండిపడుతున్నారు. అయితే తనను పదవి నుంచి తొలగించడానికి భారత్ ప్రోద్బలంతోనే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేపీ ఓలి ఇటీవల ఆరోపణలు చేసారు.

Related News